ఆమెకి సినిమాపై చాలా విషయాల్లో పట్టుంది. అందుకే పదేళ్ల క్రితమే దర్శకురాలైంది.
తర్వాత అనేక మీడియా హౌసెస్‌లో క్రియేటివ్ హెడ్‌గా జాబ్స్ చేసింది.
ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ జరుగుతున్న ‘హరికథ’ వెబ్‌సిరీస్‌ను పిక్‌చేసి, పిచ్ చేసింది ఆమెనే.
అందుకే ‘హరికథ’ ఈవెంట్‌లో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్, మరియు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఆమె కష్టాన్ని గుర్తించి ఆమె ప్రతిభని గురించి ఎంతో గొప్పగా చెప్పారు.
మ్యాగి దర్శకునిగా కొత్తరకం కథతో తన కెరీర్‌ను మొదలుపెట్టి ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించటంలో ఈమె పాత్ర ఎంతో ఉందన్నారు..
ఇంతమంది మెచ్చుకున్న ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె ప్రముఖ రచయిత నటుడునిర్మాత యం.యస్ నారాయణ గారి తనయ శశికిరణ్ నారాయణ్.
‘హరికథ’ కోసం తాను కష్టపడుతూనే ఎంతో ఎంజాయ్ చేశానని, ప్రస్తుతం సన్‌నెక్ట్స్ తెలుగు క్రియేటివ్ హెడ్‌గా వర్క్ చేస్తున్నాను అన్నారు.
ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో తన ఇద్దరి పిల్లల గురించి, తనగురించి మరెన్నో వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు శశికిరణ్.
ఆమె మాటల్లో ఎంతో ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం చాలామందికి ధైర్యంగా పోరాడమని, ఎక్కడా ఆడిపోకుండా ముందుకు వెళ్లమని ప్రోత్సాహాన్నిస్తుంది.
చూసి ఎంజాయ్ చేయండి. ఇంటర్వూ బై శివమల్లాల
Also read this : హ్యాపీబర్త్‌డే టు బ్యూటిఫుల్ న్యూట్రీషియనిస్ట్