“లైలా” ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ ప్రత్యేకమైన వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చిత్రబృందానికి గర్వకారణంగా మారింది.
లైలా సినిమా విశ్వక్సేన్ కెరీర్‌లో మరో విభిన్నమైన ప్రయోగంగా రాబోతోంది.
ఇంటెన్స్ కథనంతో, ఆకట్టుకునే ప్రదర్శనలతో, ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతికి తీసుకెళ్లనుంది.
ఆకర్షణీయమైన కథా నేపథ్యం, అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో “లైలా” ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ మెగా స్టార్ చిరంజీవి గారి సాన్నిధ్యంలో మరింత వైభవంగా జరగనుంది.
టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న విశ్వక్ సేన్, తన సినిమాలకు ప్రత్యేకమైన ప్రమోషన్ ప్లాన్ చేస్తుంటారు.
ఇప్పుడు మెగాస్టార్ హాజరవుతున్న ఈ వేడుకతో, సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.
అభిమానులు, సినీ ప్రేమికులు ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి ఈ సినిమా రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసే ఈ వేడుకను మిస్ అవ్వకుండా ఉండేందుకు అన్ని వివరాలను అప్‌డేట్ చేస్తుంటాం అని చిత్ర యూనిట్ చెప్పింది.
సంజు పిల్లలమర్రి
Also Read This : వారం ముందుగా వస్తున్న రామం రాఘవం..
