మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెగా 157 రూపొందనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఉగాది పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సినిమా ఇంకా పట్టాలెక్కనే లేదు కానీ ప్రమోషన్స్‌ను మాత్రం మేకర్స్ ప్రారంభించేశారు.
దీనిలో భాగంగా చిరంజీవి కెరీర్‌లోని ఐకానిక్ పాత్రలతో ఒక వినూత్నమైన వీడియోను రూపొందించి చిత్ర యూనిట్ విడుదల చేసింది.
వీడియో ప్రారంభం నుంచి ఎండ్ వరకూ ఆసక్తికరంగా సాగింది.
మెగాస్టార్ ఐకానిక్ పాత్రలకు సంబంధించిన కటౌట్స్‌ను రూపొందించి ఒక్కొక్క కటౌట్ దగ్గర ఒకొక్కరు నిలబడి తమను తాము పరిచయం చేసుకున్న తీరు ఆసక్తికరంగా అనిపించింది.
దర్శకత్వ విభాగం చిరంజీవి వినోదాత్మక టైమింగ్ చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు.
రచయితలు అజ్జు మహాకాళి, తిరుమల నాగ, ఉపేంద్ర తమ రైటింగ్‌తో డైమాండ్స్ మాదిరిగా పనిచేస్తామని సరదాగా చెప్పారు.
రచయిత నారాయణ అయితే అనిల్ రవిపూడి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని హిట్లర్‌లా ప్రశ్నిస్తానని చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రచయిత ఎస్.కృష్ణ ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం అని అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్ తనను తాను “మేస్త్రీ”గా పేర్కొంటూ ఎంట్రీ ఇచ్చారు.
ఎడిటర్ తమ్మిరాజు అవసరం లేని సీన్స్ మాత్రమే కట్ చేస్తానని సరదాగా చెప్పారు. డిఓపీ సమీర్ రెడ్డి జెట్ స్పీడ్‌లో షూట్ చేస్తానని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో మాస్టర్ పాటపాడుతూ ఎంట్రీ ఇవ్వగా.. చిరంజీవి స్వయంగా “గోదారి గట్టు” పాట పాడి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
నుండి కొన్ని లైన్స్ ఆలపించడం అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
నిర్మాతలు సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ప్రేక్షకులకు బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ అందిస్తామని చెప్పారు. ఇంటి పేరు ఏం చెప్పావని సుష్మితను చిరంజీవి తిరిగి ప్రశ్నించడం ఆసక్తికరం.
ఆమె కొణిదెల అని చెప్పగా ఇంటి పేరు నిలబెట్టాలని సరదాగా చెప్పారు.
ఫైనల్‌గా అనిల్ రవిపూడి ఎంట్రీ ఇచ్చి తాను గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరిస్తానని చెబుతూ.. రఫ్ఫాడిద్దాం అంటూ ఆకట్టుకున్నారు.
మొత్తానికి సినిమా పట్టాలెక్కకముందే అనిల్ రావిపూడి ప్రమోషన్స్‌ను పట్టాలెక్కించేశారు. ఇలాంటి ప్రమోషన్స్ మేమెక్కడా చూడలేదని ప్రేక్షకులు అంటున్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : నాగవంశీ ఆవేదనలో న్యాయమెంత ?
