Chiranjeevi: మా బిడ్డ మార్క్‌శంకర్ ఇంటికొచ్చేశాడు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్ కోలుకుని ఇంటికి వచ్చేశాడు. అయితే ఇంకా కొంచెం కోలుకోవాల్సి ఉందని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్విటర్ వేదికగా వెల్లడించారు. తమ కులదైవం ఆంజనేయ స్వామి (Anjaneya Swamy) దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి ఎప్పటిలాగే ఉంటాడని వెల్లడించారు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో  త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కల్యణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’’ అని తెలిపారు. కాగా.. సింగపూర్‌ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. వెంటనే చిన్నారికి ఆసుపత్రిలో చికిత్సను అందించారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి దంపతులతో పాటు పవన్ కల్యాణ్ సింగపూర్‌కు వెళ్లారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *