శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింగిల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో హోల్సమ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కేతిక విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకుంది. ‘‘గీతా ఆర్ట్స్ సంస్థలో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో నా కోరిక ఈ సినిమాతో నెరవేరింది. అద్భుతమైన కంటెంట్ ఉంటేనే అల్లు అరవింద్ గారు ఒక సినిమాని ప్రెజెంట్ చేస్తారు. ఈ సినిమా గురించి నాకు కాల్ వచ్చినప్పుడు ఫైనల్‌గా గీత ఆర్ట్స్‌లో వర్క్ చేస్తున్నాననే ఆనందం.. కథ వింటుంటే అద్భుతంగా అనిపించింది. ఇది పర్ఫెక్ట్ స్టార్ కాస్ట్‌తో వస్తున్న వెరీ ఫన్ ఫిల్డ్ ఫిలిం. ఈ సినిమాలో పూర్వా అనే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. తను వెరీ ఇండిపెండెంట్, ప్రాక్టికల్ గర్ల్ కావడంతో పాటు ఎమోషన్ అనేది ఈ క్యారెక్టర్ ద్వారానే వస్తుంది.కొన్ని సీరియస్ ఎలిమెంట్స్ మినహా అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.
శ్రీ విష్ణు గారు మంచి వ్యక్తి. చాలా సింపుల్, చాలా హంబుల్, ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవల్. ఇవానా వెరీ బ్యూటిఫుల్ అండ్ పాజిటివ్ నేచర్ ఉన్న గర్ల్. ఆన్ స్క్రీన్‌లో మా మధ్య ఒకటి రెండు సీన్స్ ఉన్నా కూడా మేం మంచి స్నేహితులం అయ్యాం. ‘రాబిన్‌హుడ్’ మూవీలో నేను చేసిన ‘అదిదా సర్‌ప్రైజ్’ పాట వైరల్ కావడం చాలా ఆనందాన్నిచ్చింది. ‘సింగిల్’ లో అలాంటి డ్యాన్సింగ్ నంబర్ ఏమీ లేదు. కార్తీక్ గారు వెరీ ఫ్యాషనేట్ ఫిలిం మేకర్.. ఆయనకి చాలా క్లియర్ విజన్, ఏం కావాలో క్లారిటీ.. ఈ సినిమాని హైలీ ఎంటర్టైనింగ్ మూవీగా తీర్చిదిద్దారు. నా కెరీర్ పట్ల చాలా ఆనందంగా ఉన్నాను . పని చేయడం ఒక్కటే మన చేతిలో ఉంటుంది.. కానీ గెలుపోటములు ఉండవు. రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా నేనెప్పుడూ కెరీర్ ని సెలబ్రేట్ చేసుకోవాలనే చూస్తుంటాను. నిజంగా ఒక నటిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తాను’’ అని తెలిపారు.
ప్రజావాణి చీదిరాల