కెరీర్‌లో అవకాశాల కోసం చాలామంది హీరోలు, హీరోయిన్లు తమను తాము మార్చుకుంటూ ముందుకు సాగుతుంటారు.
ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అలాంటి ఓ సాహసోపేతమైన మార్పుకు తెరలేపింది.
ఇప్పటివరకు క్యూట్ లుక్స్‌తో అలరించిన కీర్తి, ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది.
బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కీర్తికి ఆ సినిమా ఆశించిన విజయాన్ని తీయలేకపోయినా,
ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్‌సిరీస్ చేసిన కీర్తి, “అక్క” అనే ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి హింట్ లేకుండా, నెట్‌ఫ్లిక్స్ సడెన్‌గా దీనిని అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వెబ్‌సిరీస్‌ను ధర్మ రాజ్ శెట్టి డైరెక్ట్ చేస్తుండగా, కీర్తి సురేష్, రాధికా ఆప్టే కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే, ఇది మహిళా ఆధిపత్యం కలిగిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది.
సీరీస్ ప్రధానంగా గోల్డ్ స్మగ్లింగ్, ఆయుధాల అక్రమ రవాణా నేపథ్యంలో నడుస్తుందనే అభిప్రాయం కలుగుతోంది.
ఇందులో కీర్తి లుక్స్, బాడీ లాంగ్వేజ్, కళ్లలో కనిపించే పవర్ అంతా కొత్తగా, అయితే ఓ దృఢ నైపుణ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్‌తో అయినా కీర్తి బాలీవుడ్‌లో మళ్లీ నిలదొక్కుకుంటుందా అన్నది చూడాల్సిందే!
సంజు పిల్లలమర్రి
Also Read This : ఆత్మహత్య చేసుకున్న కబాలి నిర్మాత….
