Keeravani: పవన్ కల్యాణ్ ఒక కార్చిచ్చు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం నుంచి మూడవ సాంగ్ ‘అసుర హననం’ ఇవాళ విడుదలైంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈవెంట్‌లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. ‘‘హరి హర వీరమల్లు’ సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం రాధాకృష్ణ(క్రిష్)తో మొదలై.. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తైంది. చాలా మంది దర్శకులతో పోలిస్తే జ్యోతిలో ఒక అరుదైన క్వాలిటీ ఉంది. పవన్ కల్యాణ్ గారిని మీరందరూ పవర్ స్టార్ అంటారు. నేను మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటాను. ఎందుకంటే ఆగ్రహం అనేది అందరికీ వస్తుంది కానీ ధర్మాగ్రహం అనేది సమాజం కోసం వస్తుంది. పవన్ కల్యాణ్ ఒక జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చు లాంటి వారు. కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు’’ అంటూ చెప్పుకొచ్చారు.

చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలనేది ప్రతి దర్శకుడి కల. అలా దర్శకత్వం చేసే అవకాశం వస్తే అదొక అవార్డు గెలుచుకున్న ఫీలింగ్. నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని, రత్నం గారిని మెప్పించడం మామూలు విషయం కాదు. అలాంటిది ఆ ఇద్దరూ మెచ్చారంటే.. ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయి స్పందన సొంతం చేసుకోబోతుందో మీరే ఊహించుకోవచ్చుకత్తికి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఈ కథ.” అన్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, “ఈ సినిమా గురించి ఇది నా మొదటి ప్రెస్ మీట్. మరో రెండు భారీ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. 54 ఏళ్ల నా సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, హిందీ అన్ని భాషల్లో సినిమాలు తీశాను. 90 శాతానికి పైగా నా సినిమాలు విజయం సాధించాయి’’ అన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘హరి హర వీరమల్లు అనేది నాకొక ఎమోషనల్ జర్నీ. పవన్ కల్యాణ్ గారి వీరాభిమానిని అయిన నేను ఆయనతో కలిసి నటించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’’ అని తెలిపింది.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *