ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 53 ఏళ్ల సంజయ్.. నిత్యం పోలో ఆడుతూ ఉంటారు. అయితే తాజాగా యూకేలో పోలో గేమ్‌లో భాగంగా గుర్రాన్ని నడుపుతుండగా ఆయన నోటిలోకి తేనెటీగె వెళ్లినట్టు సమాచారం. దీంతో ఆయన చాలా ఇబ్బందిపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది.
ఇండియాలోని ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరైన సంజయ్ కపూర్.. 2003లో కరీనాను వివాహం చేసుకున్నారు. ఈ జంట పదేళ్ల తర్వాత అంటే 2014లో విడాకులు తీసుకుంది. ఆ తరువాత ప్రియా సచ్‌దేవ్‌ను సంజయ్ వివాహం చేసుకున్నారు. ఆటోమేటివ్ వ్యాపార రంగంలో అపార అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం ప్రకటించారు.