Kannappa Trailer: వినపడని వాడికి విన్నపాలు ఎందుకు? వీళ్లకు దండాలెందుకు?

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు ‘కన్నప్ప’ ట్రైలర్ వచ్చేసింది. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర దాదాపు అందరికీ తెలిసిందే. అయితే దానిని ఎంత ఆసక్తికరంగా మలిచారన్నదే ప్రధానం. పైగా ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌) తదితర స్టార్‌ హీరోలు కీలక పాత్రలు పోషించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తికగా ఎదురు చూశారు. ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండబోతోందన్న క్లారిటీ రావడంతో పాటు.. అసలు స్టార్ హీరోల పాత్రలు ఎలా ఉంటాయన్న విషయమై స్పష్టత వస్తుంది. మొత్తానికి ట్రైలర్ అయితే విడుదలైంది. దేవుడు లేడనుకునే తిన్నడు శివ భక్తుడిగా ఎలా మారాడన్నదే కథాంశం.

వాయులింగాన్ని రక్షించేందుకు కన్నప్ప.. వాయులింగ రహస్యాన్ని కాపాడేందుకు తన ప్రాణాలనైనా అర్పించేందుకు వెనుకాడని మహాదేవశాస్త్రి (మోహన్‌బాబు).. ఇద్దరూ వారి పాత్రల్లో ఒదిగిపోయారనే అనిపిస్తోంది. ‘దేవుడు లేడు.. దేవుడు లేడు.. అది ఒట్టి రాయి’ అంటూ తిన్నడు చిన్నప్పుడు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ‘వినపడని వాడికి విన్నపాలు ఎందుకు? వీళ్లకు దండాలెందుకు?’ అంటూ తిన్నడు చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి దాదాపు సినిమాలో నటించిన స్టార్ హీరోలందరినీ ట్రైలర్‌లో చూపించారు. రుద్రగా ప్రభాస్.. శివుడిగా అక్షయ్ కుమార్‌కు వారి స్టార్‌డమ్‌కు తగిన పాత్రలే దక్కాయి. ‘మహాభారతం’ సీరియల్‌ ఫేమ్‌ ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *