Dil Raju: ఆ విషయంలో‘కన్నప్ప’ఆదర్శం

మంచి ఏదైనా సరే అనుసరించాల్సిందేనని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు. ఆయన నిర్మించిన ‘తమ్ముడు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు ఇవాళ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెగిటివ్ ట్రోలింగ్‌ని, ఫేక్ రివ్యూలను అరికట్టడంలో ‘కన్నప్ప’ మార్గాన్ని అనుసరించనున్నట్టు వెల్లడించారు. ‘కన్నప్ప’ సినిమా విడుదలకు ముందు మంచు విష్ణు ఓ హెచ్చరికను జారీ చేశారు.

సినిమాను టార్గెట్ చేస్తూ నెగిటివ్ పోస్టులు పెట్టినా, పరువుకు భంగం కలిగించేలా వ్యక్తిగత విమర్శలు చేస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పబ్లిక్ కాషన్ నోటీస్‌ని సోషల్ మీడియాలో మంచు విష్ణు పోస్ట్ చేశారు. దీంతో నెగటివ్ ట్రోలింగ్, ఫేక్ రివ్యూస్ ఏవీ రాలేదు. తాజాగా నెగిటివ్ ట్రోలింగ్‌పై స్పందించిన దిల్ రాజు సైతం ‘కన్నప్ప బృందం మంచి నిర్ణయం తీసుకుందని.. రిలీజ్‌కు ముందే అలాంటి ఒక హెచ్చరికతో ఫేక్ రివ్యూస్, నెగిటివ్ ట్రోలింగ్, పైరసీ తగ్గిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ మార్గాన్నే తాము కూడా అనుసరిస్తామన్నారు. సినిమాపై నెగిటివ్‌గా రాయడం వలన ఎక్కువగా నష్టపోయేది నిర్మాతేనని పేర్కొన్నారు. కాబట్టి జెన్యూన్‌గా రివ్యూస్ ఇవ్వాలని.. సాయం చేయకున్నా పర్వాలేదు కానీ డ్యామేజ్ మాత్రం చేయవద్దని దిల్ రాజు కోరారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *