janhvi kapoor : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర. ఈ
సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ అండ్ సుధాకర్ మిక్కిలినేని లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ
సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా అందాల బొమ్మ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా నుండి జాన్వీ కపూర్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. జాన్వీ చూడటానికి చాలా ట్రెడిషన్ గా – మంచి అట్రాక్టివ్ లుక్ లో ఉంది. ఈ
సినిమాకు జాన్వీ ని తీసుకున్నప్పుడు హీరోయిన్ లుక్ మోస్ట్ గ్లామర్ ఏమో అనుకున్నారు అంతా.. ఎందుకంటే అందాల ఆరోబోతకు ఎటువంటి
హద్దులు పెట్టదు జాన్వీ కపూర్. ఆ విషయం ఆమె ఫోటో షూట్ లు చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. కానీ ఇప్పుడు జాన్వీ లుక్ చూసిన అందరూ షాక్ అవుతున్నారు.
కొరటాల శివ కూడా కోరుకున్నది కూడా ఇదే.. ఈ సినిమాలో జాన్వీ ని చూపించే విధానంలో ఇండియన్ సినిమా లవర్స్ కి శ్రీదేవి ని గుర్తుకుతెవాలి
అని. ఈ విషయంలో కొరటాల పూర్తిగా సక్సస్ అయ్యాడు అనేదానికి ఈ పిక్ నిదర్శనం. కాగా ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
ఇండియన్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు వేరే లేవేల్ లో ఉన్నాయి.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…