పీకల్లోతు ప్రేమలో అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్..!

నటి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), చియాన్ విక్రమ్ (Chiyan Vikram) కుమారుడు ధ్రువ్‌ విక్రమ్‌ (Dhruv vikram) ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరిద్దరికి సంబంధించిన ఓ ప్రైవేట్‌ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడం ప్రచారానికి తెరదీసింది. ఆ ఫోటో వారిద్దరి లిప్ లాక్‌కు సంబంధించిన ఫోటో కావడంతో. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ జంటగా ‘బైసన్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ధ్రువ్ కబడ్డీ ప్లేయర్‌గానూ.. అనుపమ ఆయన ప్రియురాలి పాత్రలోనూ నటిస్తున్నారు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో ఈ సినిమాకు సంబంధించిందేనని కొందరు భావిస్తున్నారు. కేరళ కుట్టి అనుపమ.. ‘ప్రేమమ్‌’తో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు యత్నిస్తోంది. ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌గా రూపొందిన ‘ఆదిత్య వర్మ’తో సినీ పరిశ్రమకు పరిచయమైన ధ్రువ్ అనంతరం తండ్రితో కలిసి ‘మహాన్‌’ కోసం పని చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *