రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమం హైటెక్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తున్న విషయం ఏంటంటే.. సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే వేదికపైకి రానుండటం. ‘పుష్ప 2’ తర్వాత జరిగిన ఘటనలు అందరికీ తెలిసిందే. ఆ తరుణంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. ఒకరకంగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా వార్ నడిచింది. ఆ తరువాత సినీ పెద్దలు కలుగజేసుకోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. అయితే సీఎం రేవంత్, అల్లు అర్జున్ ఒకే వేదికపైకి రావడం అనేది ఇప్పటి వరకూ జరగలేదు. ఇవాళ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరవడం.. నందమూరి బాలకృష్ణకు ఒక పక్క సీఎం రేవంత్.. మరో పక్క అల్లు అర్జున్ కూర్చోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రజావాణి చీదిరాల