ప్రభాస్ సెట్‌లో విందు భోజనం తప్పనిసరి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏ సినిమా చేసినా, సెట్‌లో విందు భోజనం ఉండాల్సిందే.
ఆయన ఇంటి నుంచి వచ్చే భోజనం గురించి ఇప్పటికే అనేకమంది నటీనటులు ప్రశంసలు అందించారు.
ఇప్పుడు “ఫౌజీ” (వర్కింగ్ టైటిల్) మూవీ హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయెల్ కూడా ఈ లిస్ట్‌లో చేరింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “ఫౌజీ” సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఈ క్రమంలో ప్రభాస్ తన ఇంటి భోజనం కొత్త హీరోయిన్ ఇమాన్వీకి రుచి చూపించాడు.
ప్రభాస్ ఇచ్చిన రుచికరమైన భోజనం తిన్న తర్వాత, ఇమాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
“ఇంతటివి కల్పించినందుకు థాంక్యూ ప్రభాస్!” అని రాసి, ఆ ఫోటోతో పాటు నోట్లో నీళ్లూరే ఎమోజీ కూడా జత చేసింది.
ప్రభాస్ ఇంటి భోజనానికి ప్రత్యేకమైన క్రేజ్!
ప్రభాస్ ఇంటి భోజనం అంటే సహ నటినటులు, సిబ్బంది అందరికీ స్పెషల్.
ఆయన కోసం మాత్రమే కాకుండా, మరింత మంది కోసం పెద్ద క్యారేజ్‌లో 10-15 రకాల వంటకాలు వస్తాయి.
ఇప్పుడు ఇమాన్వీ కూడా ఈ భోజన ఫ్యాన్ క్లబ్‌లో చేరిపోయింది.
“ఫౌజీ” మూవీ హను రాఘవపూడి దర్శకత్వంలో 1970 ప్రభాస్ సైనికుడి పాత్రలో పీరియాడిక్ డ్రామా రజాకర్ల ఉద్యమ నేపథ్యంలో ఈ కథ జరగనుంది.
ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్.
సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి, త్వరలో మరిన్ని అప్డేట్‌లు వచ్చే అవకాశముంది!
సంజు పిల్లలమర్రి
Also Read This : అంజనమ్మ పుట్టినరోజు చిరు, చరణ్ ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారో