Allu Arjun :
తన స్టైల్‌తో,నటనతో ,డాన్స్‌లు, ఫైట్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తెలుగు సినిమా హీరోల్లో ఏ నటుడు అందుకోలేని నేషనల్ అవార్డు ఫర్ ది బెస్ట్ యాక్టర్ అనే హోదాను అందుకున్న ఏకైక తెలుగు స్టార్ బన్నీనే అని మనకు తెలిసిందే. ఆయన తన సొంత టాలెంట్‌తో, క్రమశిక్షణతో ఈ స్థాయికి చేరుకున్నారని అందరికి తెలిసిందే. 8వ తెలుగు సంబరాల్లో (నాట్స్) ఆయన పాల్గొని అమెరికాలోని తెలుగు వారందరికి తన ఫ్యాన్స్‌కి ఎంతో ఉత్సాహాన్ని అందించటానికి రెడీ అయ్యారు. జూలై 4,5,6 తేదిల్లో ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాలో జరుగుతున్న నాట్స్ వేడుకల్లో ఆయన పాల్గొనటం ఎంతో ఆనందం అంటూ నాట్స్ ప్రతినిధులు తెలియచేశారు.
శివమల్లాల
Also Read This : ‘హరి హర వీరమల్లు’కు మరో గండం.. గట్టెక్కుతుందా?