Manchu Vishnu: అమితాబ్‌ను డైరెక్ట్ చేయడం నా కల

తన కలల ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’తో ప్రేక్షకులను అలరించేందుకు మంచు విష్ణు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే బీభత్సంగా సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆయనకు అమితాబ్‌ను డైరెక్ట్ చేయాలని ఉందట. అది తన కల అని చెప్పాడు. ఇంటర్వ్యూలో మీరు డైరెక్షన్ సైడ్ ఏమైనా వెళతారా? అని ప్రశ్నించగా.. తాను డైరెక్షన్ చేస్తే అమితాబ్ సినిమానే డైరెక్ట్ చేస్తానని.. అది తన కల అని తెలిపాడు.

భారతీయులంతా అమితాబ్‌ను ఎంతగానో ఇష్టపడతారని మంచు విష్ణు వెల్లడించాడు. గతేడాది వచ్చిన ‘కల్కి’ చిత్రంలో అశ్వత్థామగా ఆయన నటన అద్భుతమని కొనియాడాడు. ఈ నెల 27న కన్నప్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి యూ/ఏను సెన్సార్ ఇచ్చింది. రన్ టైమ్ వచ్చే 182 నిమిషాలు. ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు నిర్మించడంతో పాటు మహాదేవ శాస్త్రి పాత్రలో నటించారు. టైటిల్ రోల్‌లో మంచు విష్ణు నటించగా.. ప్రభాస్ రుద్రగా నటించాడు. శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *