మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో విశాల్ వివాహం ఫలానా అమ్మాయితో అంటూ చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఎందుకోగానీ ఏ ఒక్కటీ పెళ్లి పీటల వరకూ వెళ్లలేదు. గతంలో ఓసారి ఒక హైదరాబాద్‌కు చెందిన నటి అనీషాతో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. దీంతో ఈసారి విశాల్ వివాహం ఫిక్స్ అనుకున్నారంతా కానీ అది కూడా అవలేదు. ప్రస్తుతం ఓ హీరోయిన్‌తో విశాల్ పెళ్లంటూ ప్రచారం జోరుగానే సాగుతోంది. విశాల్ కూడా ఇటీవల తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించడం కూడా ఈ వార్తలకు బలం చేకూరినట్టైంది. హీరోయిన్ సాయి ధన్సికతో విశాల్ ఏడడుగులు వేయనున్నాడంటూ జోరుగానే ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ సారి ఫిక్స్ అని కూడా వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారట. వీరి పెద్దలు వివాహానికి అంగీకారం తెలపడంతో పెళ్లికి రెడీ అయిపోతున్నారని ఆంగ్ల మీడియా కథనం. అయితే ఈ వార్తలపై అటు విశాల్ కానీ ఇటు సాయి ధన్సిక కానీ స్పందించిందే లేదు. అయితే త్వరలోనే పెళ్లి చేసుకుంటానని.. తనకు జీవిత భాగస్వామి దొరికేసిందని విశాల్ కొద్ది రోజుల క్రితం తెలిపాడు. ఇప్పటికే తమ మధ్య పెళ్లి గురించి చర్చలు నడుస్తున్నాయని.. కచ్చితంగా తమది ప్రేమ వివాహమేనని వెల్లడించాడు. త్వరలో అన్ని వివరాలూ తెలియజేస్తానని తెలిపాడు. తమిళనాడుకు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన ‘షికారు’, ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.