గేమ్ చేంజర్ కి సెన్సార్ నుండి గ్రీన్ సిగ్నల్ ….

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.

ముఖ్యంగా ఫ్ల్యాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర, అందుకు సంబంధించిన సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయని అంటున్నారు.

సెకండ్ హాఫ్‌లో వచ్చే అంజలి పాత్ర సైతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.

తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు

సెన్సార్‌ బోర్డ్‌ నుంచి ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లోని సన్నివేశాలకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

అంతే కాకుండా కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్‌ని మ్యూట్‌ చేయడం, కొన్ని టైటిల్‌ కార్డ్స్ పేర్లను తొలగించడం ఇలా సెన్సార్‌ బోర్డ్‌ నుంచి చిన్న చిన్న మార్పులతో క్లియరెన్స్ వచ్చింది.

ఈ సినిమా మొత్తంగా 165 నిమిషాలు అంటే 2 గంటల 45 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉంటుంది.

రామ్‌ చరణ్ నాలుగు ఏళ్ల తర్వాత ఈ సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వినయ విధేయ రామ సినిమాతో గతంలో నిరాశ పరచిన రామ్‌ చరణ్ ఈ సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అని వ్యక్తం చేస్తున్నారు.

శంకర్‌ దర్శకత్వంలో సినిమా ప్రకటించిన సమయంలో అంచనాలు భారీగా పెరిగాయి. మధ్యలో ఇండియన్‌ 2 సినిమా నిరాశపరిచిన కారణంగా చరణ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇండియన్ 2 ఫలితం తో సంబంధం లేకుండా గేమ్‌ చేంజర్‌ టీజర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. టీజర్ విడుదల తర్వాత మొత్తం మారి పోయింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

నేడు సాయంత్రం సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరగడం ఖాయం.

సంజు పిల్లలమర్రి

Also read this : అమెరికా వెళ్లాక లైఫ్‌ని ఎలా లీడ్‌చేయాలి– ప్రవీణ్‌ బొర్రా మాటల్లో…

Harikatha director maggi
Harikatha director maggi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *