మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట ‘తు మేరా లవర్’ విడుదలైంది. ముందుగా ప్రోమోను వదిలి పాటపై మంచి హైప్‌ను క్రియేట్ చేసిన మేకర్స్ పాటను విడుదల చేసి మరింత అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. ఇప్పటికే ధమాకా చిత్రంతో మంచి జోడిగా ప్రేక్షకుల మందిలో నిలిచిన రవితేజ-శ్రీలీల ఈ పాటతో అందరి అంచనాలను అందుకునేలా, అద్భుతమైన కెమిస్ట్రీతో మరోసారి మ్యాజిక్ చేశారు.
భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరి అంచనాలను అందుకుంటుందనడంలో సందేహం లేదు. పాటలో ‘ఇడియట్’ సాంగ్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ మ్యూజిక్.. సిగ్నేచర్ స్టెప్ రిపీట్ అవడంతో సాంగ్ రేంజే మారిపోయింది. ఈ పాట కోసం ఏఐని ఉపయోగించి మరీ దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని పున:సృష్టించారు. రవితేజ శైలి ప్రత్యేక డ్యాన్స్ స్టెప్పులు, శ్రీలీల అద్భుతమైన డ్యాన్స్, హావభావాలతో ఆకట్టుకుంది. ‘మాస్ జాతర’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు కానీ మేకర్స్ ప్రమోషన్స్ మాత్రం ఇప్పటికే ప్రారంభించేశారు.
ప్రజావాణి చీదిరాల