మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నేడు (శనివారం) హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రోమో ఇచ్చి పాటపై హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ పాటను విడుదల చేసి చిరు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేశారు. ‘జై శ్రీరామ్’ అనే చిరు వాయిస్‌తో పాట ప్రారంభమవుతుంది. ‘రామ.. రామ..’ అంటూ సాగే ఈ పాటను కీరవాణి స్వరపరచగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. శంకర్ మహదేవన్, లిప్సిక పాడిన ఈ పాట హనుమ జయంతికి అద్భుతమైన ట్రీట్‌లా ఉంది.
‘తయ్యతక్క తక్కధిమి చెక్కభజనాలాడి..రాములోరి గొప్ప చెప్పుకుందామా.. నీ గొంతు కలిపి మా వంత పాడగ.. రావయ్య అంజని హనుమా..’ అంటూ సాగే ఈ పాట భక్తిభావాన్ని పెంపొందించేదిగా ఉంది. ఇక ఈ పాటకు చిరు స్టెప్స్‌తో మరింత వన్నె తెచ్చారు. మొత్తానికి హనుమాన్ జయంతికి గూస్‌బంప్స్ వచ్చేలా పాటను రూపొందించి మేకర్స్ వదిలారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల