ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ కాగా.. మరొకటి హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’. త్వరలోనే ‘స్పిరిట్’ మూవీని సైతం లైన్‌లో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. హను రాఘవపూడి అయితే ‘ఫౌజి’ సినిమాను చకచకా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి ఎస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఓ ఇంటర్వ్యూలో హను రాఘవపూడి మాట్లాడుతూ.. ప్రభాస్ కోసమే తాను ఈ కథ రాశానని అన్నారు. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే ఎన్నో విశేషాలు ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు. వాటిలో ఒక సర్‌ప్రైజ్‌అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత కూతురు ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర చేస్తోందని సమాచారం. ఆ నిర్మాత మరెవరో కాదు.. మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ కుమార్తె లిషా. ఈ పాప వయసులో చిన్నదైనా కానీ అద్భుతంగా నటించిందని సమాచారం.
ప్రజావాణి చీదిరాల