డ్రింకర్ సాయి రివ్యూ

కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”.

బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…….

కథ :

డ్రింకర్ సాయి మరో పని లేకుండా అదే పనిగా నిత్యం తాగుతూ తాగుబోతుగా గుర్తింపు తెచ్చుకుంటాడు.

సాయికి కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నా తల్లిదండ్రులు మాత్రం అప్పటికే చనిపోయి ఉంటారు.

ఈ నేపథ్యంలో సాయి తాగుడికి అడ్డుఅదుపు లేకుండా పోతుంది.

మరోవైపు బాగీ న్యాచురోపతిని గుడ్డిగా నమ్ముతుంది. పైగా మంచి క్రమశిక్షణతో పాటు,

మంచి ఆరోగ్య అలవాట్లు ఉన్న బాగీ జీవితంలోకి డ్రింకర్ సాయి ఎంట్రీ ఇస్తాడు.

ఆమె వెంటే పడుతూ ఆమెను సాయి ప్రేమించేపనిలో ఉంటాడు.

ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో డ్రింకర్ సాయి- బాగీల మధ్య ఎలాంటి ప్రేమ కథ నడిచింది ?

అసలు బాగీ డ్రింకర్ సాయిని ప్రేమిస్తుందా లేదా? ప్రేమిస్తే దానికి గల కారణాలు ఏమిటి ?

ఇంతకీ డ్రింకర్ సాయిలో మార్పు వస్తోందా రాదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో హీరోగా నటించిన ధర్మ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు.

అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.

హీరోయిన్ ఐశ్వర్య శర్మ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది.

మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ తన నటనతో మెప్పించాడు.

ఇతర పాత్రల్లో నటించిన పోసాని కృష్ణమురళి, సమీర్, బద్రం, SS కాంచీ, కిరాక్ సీత, రీతూ చౌదరి, ఫన్‌బకెట్ రాజేష్, రాజా ప్రజ్వల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్

దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి పనితనం కొన్నిసన్నివేశాల్లో ఆకట్టుకునే విధంగా సాగినా,

ల్యాగ్ సీన్స్ విషయంలో దర్శకుడు ముందే జాగ్రత్త పడి ఉండాల్సింది.

పైగా కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడం, సెకండ్ హాఫ్ కూడా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు.

మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్ పర్వాలేదకున్నా..

మొత్తమ్మీద ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయ్యింది.

రేటింగ్ : 2.5/5

Also Read This : 2024లో ఊహించని పరిణామాలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *