బన్నీ వాస్ తొలిసారిగా ఓ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్‌తో కలిసి నవతరం నిర్మాణ సంస్థలు సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక ఆసక్తికర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రిలుక్ పోస్టర్ ఏం చెబుతుందో గ్రహించారా? ఈ ప్రీ లుక్ పోస్టర్ ఆసక్తికరంగానూ చూడగానే ఏదో కామెడీ ఎంటర్‌టైనర్ రాబోతోందని ఈ చిత్రం ద్వారా తెలుస్తోంది.
పోస్టర్‌ను పరిశీలిస్తే.. ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వరుసగా నిలబడిన వ్యక్తులతో కూడిన ఈ పోస్టర్.. ఫన్, మిస్టరీ, మ్యాడ్ నెస్‌తో రోలర్‌కోస్టర్‌ను సూచిస్తుంది. జూన్ 6న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. విజయేంద్ర ఎస్ ఈ సినిమా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాను కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్.ధృవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన కథనంతో సరికొత్త ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధంగా ఉందని మేకర్స్ చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన నటీనటులను ఆవిష్కరిస్తుండేవారు.
ప్రజావాణి చీదిరాల