ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా “నారి”.
మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు.
ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. “నారి” సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ :
మహిళల గురించి ఒక మంచి కథతో “నారి” సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది.
కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలాంటి మంచి ప్రయత్నం చేయడం సంతోషకరం.
ఆమని గారు మావిచిగురు, శుభలగ్నం లాంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు.
అలాగే మా సంస్థలో ఎంసీఏ, శ్రీనివాస కల్యాణం మూవీస్ లో నటించారు.
“నారి” సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ఈ టీమ్ కు సజెస్ట్ చేస్తున్నా. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
నటి ఆమని మాట్లాడుతూ :
ఈ రోజు మా “నారి” సినిమా ట్రైలర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది.
వాళ్ల బ్యానర్ లో నేను శ్రీనివాస కల్యాణం, ఎంసీఎ మూవీస్ చేశాను.
అప్పటి నుంచి బిజీగానే ఉంటున్నాను. వారి బ్యానర్ లో మరిన్ని మూవీస్ చేయాలని అనుకుంటున్నా.
నారి” సినిమా మహిళల గొప్పదనం చెప్పేలా మా దర్శకుడు సూర్య వంటిపల్లి రూపొందించారు.
ఈ మూవీలో ఇంతమంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన సూర్య గారికి థ్యాంక్స్.
ప్రతి మహిళ చూడాల్సిన చిత్రమిది. మహిళ జీవితంలో పుట్టినప్పటినుంచి అన్నీ కష్టాలే. అది అర్థం చేసుకున్న వాళ్లు కొద్దిమందే ఉంటారు.
ఈరోజు సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ మూవీ.
నేను ఈ క్యారెక్టర్ లో ఎంతో ఇన్వాల్వ్ అయి నటించాను.
మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న రిలీజ్ అవుతున్న మా “నారి” సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ :
మా “నారి” సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థ్యాంక్స్.
ఆయన ఎంతో బిజీగా ఉన్నా, టీమ్ తీసుకుని మా ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది
మహిళలకు రక్షణ కావాలి, మహిళల్ని గౌరవించాలి అనే కాన్సెప్ట్ తో “నారి” సినిమాను రూపొందించాను.
మా మూవీలో ఒక మహిళ జీవితాన్ని మూడు దశల్లో చూపిస్తున్నాం.
13-20 ఏళ్ల వయసున్న ఆడపిల్లలను వారి తల్లిదండ్రులు థియేటర్స్ కు తీసుకెళ్లి మా మూవీ చూపించాలని కోరుతున్నా.
“నారి” లాంటి మూవీ చేశానని నా జీవితంలో గర్వంగా చెప్పుకోగలను. అలాంటి మంచి చిత్రమిది.
మా ప్రమోషనల్ కంటెంట్ చూసి “నారి” సినిమాకు సపోర్ట్ చేయండి.
ఎందుకంటే మా సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేది మీడియా మిత్రులే.
ఆడు మగాడ్రా, నిశిలో శశిలా సాంగ్స్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలోని ప్రధాన పాత్రకు ఆమని గారిని తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాు.
అద్భుతమైన నటి ఆమని గారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న మా మూవీని రిలీజ్ కు తీసుకొస్తున్నాం.
మీరంతా తప్పకుండా థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత శ్రీమతి శశి వంటిపల్లి మాట్లాడుతూ :
మా “నారి” సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థ్యాంక్స్.
మా ఈవెంట్ కు వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. “నారి” సినిమా మహిళల కోసం చేసిన మూవీ.
అయితే ప్రేక్షకులంతా సకుటుంబంగా చూసేలా ఉంటుంది.
మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న “నారి” సినిమాకు మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం. అన్నారు.
నటి మౌనిక రెడ్డి మాట్లాడుతూ :
మా “నారి” సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.
ఎంతో శ్రమకోర్చి మా డైరెక్టర్ సూర్య గారు ఈ సినిమా రూపొందించారు.
మహిళల గొప్పదనం, ప్రస్తుతం వారు ఈ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యను ఎంతో చక్కగా ఈ మూవీలో మా డైరెక్టర్ గారు తెరకెక్కించారు.
థియేటర్స్ లో మా మూవీని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
Also Read This : రామం రాఘవం రివ్యూ….