నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ‘తమ్ముడు’ సినిమా ఈ నెల 4న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌కు పీక్స్‌కు తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియాతో సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు పలు కీలక విషయాలు వెల్లడించారు.
దీనిలో భాగంగా ‘ఒక సినిమా ప్రమోషన్‌కి ఎంత ఖర్చవుతుంది? పర్టిక్యులర్‌గా మీ సినిమా ప్రమోషన్‌కు ఎంత ఖర్చవుతుంది?’ అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘ప్రొడ్యూసర్ దగ్గర ఎంత దమ్ముంటే అంత’ అని తెలిపారు. ‘సినిమాకు దిల్ రాజు గారి చరిష్మా ఎంత మేర ఉపయోగపడుతుంది?’ అని ప్రశ్నించగా.. ‘ఎవరి చరిష్మా సినిమాకు ఉపయోగపడే రోజులు కావివి’ అంటే డబ్బు పెట్టాల్సిందేనా? అని ప్రశ్నించగా.. ‘డబ్బని కాదు.. ఒక సినిమాను ప్రాపర్‌గా రెడీ చేసి థియేటర్‌కి తీసుకెళ్లినప్పుడు ఆ మార్నింగ్ షోనే మా జీవితాలను డిసైడ్ చేస్తుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు పబ్లిసిటీకి ఎంత తక్కువ డబ్బు ఖర్చు అయ్యిందో తెలుసా? నాకే ఆశ్చర్యమేసింది. అనిల్ రావిపూడి దానిని రియాలిటీలోకి తెచ్చుకుని దానికి హైప్ తెచ్చుకుంటూ వెళ్లాడు. ఎక్కడా మాతో డబ్బు ఖర్చు పెట్టించలేదు. సినిమా కనెక్ట్ అయ్యింది కాబట్టి వావ్ నంబర్స్ వచ్చాయి.
ప్రజావాణి చీదిరాల