తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రొడ్యూసర్ దిల్ రాజు నియమితులైన విషయం తెలిసిందే.
ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రెండు సంవత్సరాల పాటు దిల్ రాజు చైర్మన్‌గా కొనసాగుతారు.
ఇదిలా ఉండగా బుధవారం చైర్మన్‌గా దిల్ రాజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
ఉదయం 10:30 గంటలకు ఆయన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు తీసుకునున్నారు.
ఇప్పటికే తనకు ఈ అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డిని దిల్ రాజు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
2003లో హీరో నితిన్ నటించిన దిల్ సినిమాకు తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం హిట్ తర్వాత ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది..
తెలుగులో మాత్రమే కాదు వేరే భాషల్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
రామ్‌చరణ్- శంకర్‌ల కాంబోలో భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నారు.
ఈ మూవీ వచ్చే జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నారు.
ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.వీటితో పాటుగా మరో మూడు ప్రాజెక్టులను అనౌన్స్ చెయ్యనున్నారని టాక్.
సంజు పిల్లలమర్రి