Dear UMA :
అచ్చ తెలుగమ్మాయి సుమయ రెడ్డి నిర్మాతగా, రచయితగా, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డియర్ ఉమ’. పృథ్వీ అంబర్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరును మేకర్స్ పెంచేశారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. సినిమా ముఖ్యంగా మెడికల్ మాఫియా బాగోతాన్ని హైలైట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అమితంగా ప్రేమించిన కూతుర్ని.. మెడిసిన్ చదివించడం కోసం సిటీకి పంపించడం.. తండ్రి భావోద్వేగానికి గురవడం.. డాక్టర్‌గా మారిన ఉమ ట్రీట్‌మెంట్ చేసే విధానం తద్వారా ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను ఈ ట్రైలర్‌లో హైలైట్ చేయడం జరిగింది. ఇక పృథ్వీ అంబర్ విషయానికి వస్తే.. ఒక సింగర్‌గా నటించాడు. ఒక సక్సెస్ దొరికే వరకూ అతను ఎదుర్కొన్న అవమానాలు.. ఆపై అందుకున్న సక్సెస్.. అనుకోని పరిస్థితుల్లో కత్తిపోటుకు గురవడం వంటి అంశాలతో పాటు హీరోహీరోయిన్ల ప్రేమను ట్రైలర్‌లో హైలైట్ చేశారు. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమతో పాటుగా ఇందులో సమాజాన్ని మేల్కొలిపే చక్కటి సందేశాన్ని సినిమా ద్వారా ఇవ్వబోతోన్నట్టుగా అర్థం అవుతోంది. ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ వంటి వారు నటించారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : అట్లీతో సినిమా.. హాట్ టాపిక్‌గా అల్లు అర్జున్ రెమ్యూనరేషన్