...

Sharwanand : దర్శనమే.. మధుర క్షణమే..

Sharwanand :

నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘నారి నారి నడుమ మురారి’ టైటిల్‌తో హీరో శర్వానంద్ సినిమా చేస్తున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘దర్శనమే’ విడుదల చేసి ప్రమోషన్స్‌కి మేకర్స్ శ్రీకారం చుట్టారు. ఈ క్లాసిక్ మెలోడిని విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేశారు. ఇది మనసుని కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. ‘దర్శనమే.. మధుర క్షణమే..’ అంటూ సాగే ఈ పాటలో శర్వా, సంయుక్తల కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.

ప్రజావాణి చీదిరాల

Also Read This : అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు

Mohana Krishna Indraganti Exclusive Interview
Mohana Krishna Indraganti Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.