‘కోర్ట్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఈ సినిమాలో నటించిన తెలుగమ్మాయి శ్రీదేవికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో అమ్మడి రేంజే మారిపోయింది. ఏకంగా రెండో సినిమాతోనే కోలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోనే ఇది. కోలీవుడ్ ప్రముఖ నిర్మాత కేజీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోనే ఆయనకు జోడిగా శ్రీదేవి నటిస్తోంది. ఇప్పటికే ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న కేజీఆర్.. ఇప్పుడు మరో చిత్రానికి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. కేజీఆర్ గంతో శివకార్తికేయన్‌తో మూడు సినిమాలు, విజయ్ సేతుపతి, ప్రభుదేవాతో ఒక్కో సినిమాను నిర్మించాడు.