రంగుల ప్రపంచంలో కుంచెపట్టిన బాపు బొమ్మ ఈమె….

సినిమాల్లో బిచ్చగత్తెగా చూపించాలన్నా, వెయ్యి కోట్ల ఆస్థిపరురాలిగా చూపించాలన్న ఒక్క డ్రెస్‌తో మేనేజ్‌ చేసేయొచ్చు. అలా వారిని క్షణాల్లో మార్చేసే డ్రస్‌లను డిజైన్‌ చేసే వ్యక్తే కాస్టూమ్‌ డిజైనర్‌. ఏ పాత్రకు ఏ డ్రెస్‌ సూటవుతుంది. ఎలాంటి డ్రెస్లు డిజైన్‌ చేస్తే నటీనటులకు వారి వారి పాత్రలకు హెల్ప్‌ అవతుంది అని స్కెచ్‌లు గీసి తన పనితనాన్ని పెన్సిల్‌తో చెప్పగల వారు డిజైనర్స్‌.
ఆమె కనిపించిన ప్రతిసారి బాపు బొమ్మలా చీరకట్టులో నవ్వుతూ అందంగా కనిపిస్తుంది. బిజీబిజీగా అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తుంటుంది. ఇంతకీ ఎవరీ అమ్మాయి అనుకుంటే ఆ అమ్మాయి ఈ సినిమా కాస్టూమ్‌ డిజైనర్‌ అని మనకు ఏ మేనేజరో సమాధానం ఇస్తారు.
సినిమా అంటేనే మాయా ప్రపంచం. అలాంటి మాయలో ప్రతి పాత్రను ఎలివేట్‌ చేయాలంటే కాస్టూమ్స్‌ చాలా ఇంపార్టెంట్‌ పాత్రను పోషిస్తాయి. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఒక నటుణ్ని చూడగానే ఇతను మంచివాడా లేదా చెడ్డవాడా ఎటువంటి పాత్రను ఈ సినిమాలో ఆయన పోసిస్తున్నారు అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇలా తెలియటానికి కారణం నటీనటులు ధరించే బట్టలు. 24 శాఖల్లో వీరికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కానీ పెద్దగా గుర్తింపు ఉండదు. అదే బాలీవుడ్‌లో అయితే వీరిని నెత్తిన పెట్టుకుంటారు . అసలు కాస్టూమ్స్‌ అందించే కాస్టూమర్‌ అంటే ఏంటి? కాస్టూమ్‌ డిజైనర్‌ అంటే ఎవరు? వారి వెనుక ఉన్న కథేంటి? వీరి వర్కింగ్‌ స్టైల్‌ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే మాత్రం ప్రముఖ సినిమా కాస్టూమ్‌ డిజైనర్‌ ప్రసన్న దంతులూరి గారి ఇంటర్వూ చూసి తీరాల్సిందే. ఇంటర్వూలో అమె చెప్పిన సంగతులు విని షాక్‌ అవ్వటం ఖాయం. దాదాపు 15 సినిమాలకు కాస్టూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించిన ప్రసన్న తనకు ఇండస్ట్రీలో ఎదురైన ఛాలెంజెస్‌ గురించి ఆమె అనుభవాలను ఎంతో చక్కగా వివరించారు. ఒక్కోసారి ఫుడ్‌ తినే సమయం కూడా ఉండదు. ఒక్కోసారి చేయటానికి ఎటువంటి పని ఉండదు అంటూ తన ఎమోషన్స్‌ను ట్యాగ్‌తెలుగు యూట్యూబ్‌ ఛానల్‌ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. మీరు ఓ లుక్కేయండి…ఇంటర్వూ బై శివమల్లాల

 

Also Read This :మైక్‌ చేతిలో ఉన్నప్పుడు, కెమెరా ఎదురుగా ఉన్నప్పుడు తస్మాత్‌ జాగ్రత్త….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *