స్ట్రీమింగ్‌కు సిద్ధమైన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్

హారర్-కామెడీ జానర్‌లో తెరకెక్కిన ‘డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం జూన్ 13న ప్రీమియర్ కావడానికి సిద్దంగా ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందనను దక్కించుకున్నాయి. ఈ చిత్రంలోని కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఇప్పటికే థియేటర్లో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతిక తివారీ నటించిన ఈ చిత్రం ఇక ఇప్పుడు జీ 5లోకి రాబోతోంది.

డీడీ నెక్స్ట్ లెవల్ జూన్ 13 నుంచి జీ 5లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవల్ కథ అంతా కూడా సినీ విమర్శకుడు కిస్సా (సంతానం) చుట్టూ తిరుగుతుంది. అతను అసాధారణ దర్శకుడు హిచ్‌కాక్ ఇరుధయరాజ్ (సెల్వరాఘవన్) ప్రైవేట్ స్క్రీనింగ్‌లోకి రావడం, అక్కడే చిత్రంలో ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడం వంటి కామెడీ, హారర్ అంశాలతో అద్యంతం వినోద భరితంగా సాగుతుంది. కిస్సా తనకు దొరికిన ఆధారాలను డీకోడ్ చేస్తూ బయటకు ఎలా వచ్చారన్నదే ఆసక్తికరంగా సాగుతుంది. జూన్ 13 నుండి జీ5లో ప్రత్యేకంగా ‘డీడీ నెక్స్ట్ లెవల్’ ప్రసారం కానుంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *