మెగాస్టార్ చిరంజీవి మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోను పోస్ట్‌చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియా ఓ రేంజ్‌లో కొంతపుంతలు తొక్కుతుంది. చిరంజీవిగారి అమ్మగారికి ఒంట్లో బాగలేదంట.
ఆమె ఆరోగ్య పరిస్థితి విషమం. అని ఇలా రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి.
దానికి కారణం ఏంటంటే మొన్నీమధ్య పెద్ద వయసు రీత్యా ఆమెకు కొంచెం సుస్తి చేసిందట.
ఆమెకి చిన్నపాటి ట్రీట్‌మెంట్ జరిగి కొద్దిగా ఇబ్బంది పడ్డారట. ఆ విషయం మీడియాకి తెలియడంతో ఆ వార్త బయటకు వచ్చింది.
అలా వచ్చిన వార్త అక్కడితో ఆగకుండా రకరకాలుగా చక్కర్లు కొట్టింది.
అందుకే ఆమెకు ఆరోగ్యం బాగుకాగానే ముందుజాగ్రత్తగా ఎందుకైనా మంచిదని ఆమెతో ఫోటోదిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరు.
ఇలాంటి విషయాల్లో చిరు చిరు జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు మీడియాకి చెప్తుంటారాయన.
ఆరోగ్యం బాగుండటంతో చిరు హ్యాపీ అమ్మ హ్యాపీ…అంటూ అభిమానులు ఆనందంగా ఉన్నారు.
శివమల్లాల
Also Read This : క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్..నేను ఏం చేయగలను– దర్శకుడు ధన్‌రాజ్ కొరనాని