ఎందుకోగానీ.. వేరే భాషలతో పోలిస్తే తెలుగు బిగ్‌బాస్‌కు.. సీజన్స్ పెరుగుతున్నా కొద్దీ క్రేజ్ తగ్గుతోంది. అయితే ఇతర షోస్‌తో పోలిస్తే మాత్రం బిగ్‌బాస్ తెలుగుకు రేటింగ్ బాగానే ఉండటంతో ఈ షోకి సంబంధించిన కొత్త సీజన్‌ను ప్రారంభించేందుకు స్టార్ మా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్‌బాస్ హౌస్ నిర్మాణాన్ని సైతం ప్రారంభించింది. ఈ హౌస్ సెట్ కొలిక్కి వచ్చిన వెంటనే బిగ్‌బాస్ సీజన్ 9 డేట్స్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ముందు ఈ సీజన్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభిస్తారని అనుకున్నారు కానీ కాస్త ముందుగానే ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. అంటే ఆగష్టు చివరి వారం నుంచే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే వారి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారిలో అలేఖ్య చిట్టి పికిల్స్, తేజస్విని, కల్పిక గణేష్, కావ్య, నవ్య స్వామి, సమీరా, ఛత్రపతి శేఖర్, ముఖేష్ గౌడ, జ్యోతి రాయ్, సాయి కిరణ్, శ్రావణి వర్మ, ఆర్జే రాజ్ తదితరుల పేర్లు వైరల్ అవుతున్నాయి. ఇక హోస్ట్ విషయానికి వస్తే.. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.