కొందరు హీరోలు ఏం పుణ్యం చేసుకున్నారో కానీ ఏజ్ పెరుగుతున్నా క్రేజ్ మాత్రం తగ్గదు. ఈ కోవకు చెందిన వారే.. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణ. వీరంతా ఇప్పటికీ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక బాలయ్య విషయానికి వస్తే.. యంగ్‌గా ఉన్నప్పుడు ఇలా వరుస హిట్స్ కొట్టారో లేదో కానీ ఇప్పుడు మాత్రం హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు. తాజాగా బాలయ్య గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. రజినీ కాంత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘జైలర్’. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీనికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందనుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో బాలయ్య కనిపించనున్నారట. ఈ సినిమాలో బాలయ్య కేవలం 20 నిమిషాల పాటు కనిపిస్తారట. దానికోసం మేకర్స్ ఆయనకు 20 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ ముట్టజెప్పనున్నారని సమాచారం. వాస్తవానికి పదేళ్ల క్రితం వరకూ ఆయన నటించిన చిత్రాలకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ ఉండేది కాదట. అలాంటిది కేవలం 20 నిమిషాల కోసం బాలయ్య రూ.20 కోట్లకు పైనే అందుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.