సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్ ఇద్దరూ విజేతలుగా నిలిచారు.
ఇద్దరు తమ సినిమాల సక్సెస్‌మీట్‌లు ఫ్యాన్స్‌ల కోలాహలాల మధ్య ఎంజాయ్ చేస్తున్నారు.
సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ‘డాకు మహరాజ్’ సినిమా వందకోట్ల క్లబ్‌లో చేరింది.
బాలయ్య కెరీర్‌లో ఇది చాలా పెద్ద బాక్సాఫీస్ కలెక్షన్ అని చెప్పాలి.
బాబి కొల్లి దర్శకునిగా ఫ్లాలెస్ బ్యూటిఫుల్ స్క్రీన్‌ప్లేతో డాకు సినిమాను బాలయ్యకు అందించి బాలకృష్ణను మాస్ హీరోగా నిలబెట్టి ఎంటర్‌టైన్‌చేశారు బాబి.
వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ అమలాపురం టు అమెరికా , అనకాపల్లి టు ఆస్ట్రేలియా ఆల్ షోస్ హౌస్‌ఫుల్ అంటూ
తమ సినిమా సాధించిన విజయం గురించి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యంగా తమ బ్యానర్‌కి దర్శకుడు అనిల్ రావిపూడికి ఎంతో అనుబంధం ఉంది అని మరో నిర్మాత శిరీష్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఇలా ఈ సంక్రాంతి రెండు సక్సెస్‌ఫుల్ సినిమాలతో సీనియర్ హీరోలిద్దరూ ఎంజాయ్ చేస్తూ తమ వంతుగా ఫ్యాన్స్‌కి పండగ వాతావరణాన్ని కల్పించారు.
అందుకే ఈ సంక్రాంతిని సీనియర్ హీరోలు ఎగరేసుకుపోయారు…
శివమల్లాల
Also Read This : #SSMB29 కోసం హైదరాబాద్ కు చేరుకున్న ప్రియాంక చోప్రా