మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభానికి ముందే ఓ వీడియోతో అనిల్ రావిపూడి అయితే సినిమాపై హైప్ పెంచేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ అంతా శరవేగంగా సాగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా అనిల్ రావిపూడి చెన్నైకు బయలుదేరారు. ఈ సినిమాలో ముందు నుంచే హీరోయిన్‌గా నయనతారను అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతా ఓకే అయితే ఊహాగానాలే నిజమవుతాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి అదే పనిలో ఉన్నారు. నయనతారను కలిసేందుకే ఆయన చెన్నై వెళ్లారు. నయనతారకు కథ చెప్పి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే హీరోయిన్ ఫిక్స్ అయిపోయినట్టే. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
ప్రజావాణి చీదిరాల