Anaganaga Oka Raju: అమ్మాయిల గుండె చప్పుడు.. మన ముందుకొచ్చేదెప్పుడు?

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా రూపొందుతున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ నవీన్ పొలిశెట్టికి ప్రమాదం జరగడంతో సినిమా ఆలస్యమైంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ ఆసక్తికర వీడియోలో నవీన్ పొలిశెట్టి లుంగీ, బనియన్ వేసుకుని, మెడలో రుమాలుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వెళుతుంటాడు.

‘నెక్ట్స్ రాబోతోంది.. ఆరడుగుల అందగాడు.. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడేవాడు.. అమ్మాయిల గుండె చప్పుడు.. మన ముందుకొచ్చేదెప్పుడు?.. ఇక టెన్షన్ ఎందుకు దండగ.. రాజుగారు ఎక్కడుంటే అక్కడ పండుగ’ అంటూ ఆసక్తికర మాటలతో వీడియో సాగుతుంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. మొత్తానికి రాజు గారు అయితే సంక్రాంతి కానుకగా వచ్చేస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *