నటుడు భరత్ ఇంట ఊహించని విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని మృతి చెందారు. గుండెపోటుతో ఆదివారం రాత్రి చెన్నైలోని తమ నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె ఆకస్మిక మరణంతో భరత్ తల్లడిల్లుతున్నాడు. ఇటీవలి కాలంలో భరత్‌కు ఆరోగ్యం కూడా సరి లేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తల్లి మరణం అతనిని మరింత వేధిస్తోంది. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, సన్నిహితులు భరత్‌కు ఫోన్ చేసి ధైర్యం చెబుుతన్నారు. భరత్ బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో కనిపించి మెప్పించాడు. హీరోగానూ చేశాడు కానీ ఎందుకో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ప్రస్తుతం భరత్ చెన్నైలోనే ఉంటున్నాడు.