‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి ముహూర్తం ఫిక్స్.. బిగ్‌బీ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన షోలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో కౌన్ బనేగా కరోడ్‌పతి ఒకటి. ఇవి ఇప్పటికే 16 సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ షో 17వ సీజన్‌కు సిద్ధమవుతోంది. అది మరెప్పుడో కాదు.. ఆగస్ట్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సోనీ టీవీ అధికారికంగా ప్రకటించడమే కాకుండా దీనికి సంబంధించిన ప్రోమోను సైతం విడుదల చేసింది. ఈ సీజన్‌కు కూడా అమితాబే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఇదంతా ఒక ఎత్తైతే ఈ సీజన్‌కు బిగ్‌బీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన రెమ్యూనరేషన్ కోట్లలోనే ఉంటుందనేది తెలిసిందే కానీ ఎంత? అంటే ప్రస్తుతం అమితాబ్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని బీ టౌన్‌లో టాక్ నడుస్తోంది. ఈ షో 25 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ షోకు క్రేజ్ తగ్గింది లేనే లేదు. బిగ్‌బీ తన హోస్టింగ్‌తో ఈ షోకు మరింత వన్నె తెస్తున్నారు. ఇది తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరిట ప్రారంభమైంది. ఐదు సీజన్లు నడిచాయి. తొలి మూడు సీజన్లకు నాగార్జున హోస్టింగ్ చేయగా.. నాలుగు, ఐదు సీజన్లకు చిరంజీవి, ఎన్టీఆర్ హోస్టింగ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *