ఇటీవలి కాలంలో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. సందర్భాన్ని ఆయా హీరో.. లేదంటే దర్శకుడు.. అదీ కాదంటూ మూవీ రిలీజ్ అయి దశాబ్ద కాలం గడుస్తున్న సందర్భంగానో వారికి సంబంధించిన ఒక హిట్ మూవీని రిరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి మూవీ విడుదలై పదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ సినిమా రీరిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. బాహుబలి రెండు భాగాలనూ కలిపి రీ మాస్టర్ చేసి స్పెషల్ వెర్షన్‌ను ‘బాహుబలి: ది ఎపిక్’ పేరిట విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. మరి రెండు భాగాలను కలిపితే సినిమా నిడివి ఎంత ఉంటుందనేగా మీ సందేహం.
వాస్తవానికి ‘బాహుబలి 1’ రన్ టైమ్ 2:38 గంటలు కాగా.. ‘బాహుబలి 2’ రన్ టైమ్ 2:31 గంటలు. ఈ రెండింటినీ కలిపితే రన్ టైమ్ దాదాపు ఐదున్నర గంటలు ఉంటుంది. కానీ ఇంత రన్ టైమ్ అంటే కష్టం కాబట్టి మూడున్నర గంటలకు కుదిస్తారని అంతా భావించారు. కానీ కుదింపు అనేది లేదని తెలుస్తోంది. నిర్మాత శోభు యార్లగడ్డ సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. బాహుబలి ది ఎపిక్ రన్ టైమ్ ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్ టైమంత ఉంటుందని అన్నారు. తాజాగా రానాను సైతం మీడియా ‘బాహుబలి’ రన్ టైమ్ విషయమై ప్రశ్నించగా.. రన్ టైమ్ ఎంత ఉన్నా తనకు సంతోషమేనన్నారు. ఈ ఏడాది తను ఏ సినిమాలోనూ నటించకుండానే తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడనుందని రానా తెలిపాడు. ఇక దీని గురించి రాజమౌళి ఏం చెబుతారా? అని అంతా వెయిటింగ్.