ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాస్, కామెడీ మూవీలో నటించి చాలా కాలం అవుతోంది. దీనికి హారర్ కూడా తోడవడం ఈ సినిమా స్పెషాలిటి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా కనిపించనుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఈ షెడ్యూల్లో ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సన్నివేశమే సినిమాకు కీలకంగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు ఒక పాటను చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ పాటలో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ కూడా కనిపించనుందని టాక్. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం తెలియడం లేదు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే పలు మార్లు సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సినిమా జాప్యం లేకుండా మారుతి పూర్తి చేస్తున్నారు. మొత్తానికి సినిమాకు సంబంధించిన అప్డేట్ అయితే ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పెంచుతోంది.