శ్రీలీలకు ఇటీవలి కాలంలో హిట్ పడిందే లేదు. అయినా సరే.. ఆది నుంచి ఈ ముద్దుగుమ్మ హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా దూసుకెళుతోంది కాబట్టి అమ్మడికి అవకాశాలు అయితే వస్తూనే ఉన్నాయి. నితిన్‌తో చేసిన ‘రాబిన్ హుడ్’తో సహా ఇటీవలి కాలంలో ఏది ఈ ముద్దుగుమ్మకు కలిసి రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కొత్త హీరో కిరీటితో కలిసి ‘జూనియర్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడి గురించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
‘జూనియర్’ సినిమా కోసం అమ్మడు తీసుకున్న రెమ్యూనరేషన్ చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులోనూ జూలై 18న విడుదల కానుంది. వాస్తవానికి ఈ ముద్దుగుమ్మ రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. కానీ ‘జూనియర్’ మూవీకి మాత్రం డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. మరి కొత్త హీరో అనో ఏమో కానీ ఈ సినిమాకు శ్రీలీలకు రూ.4 కోట్ల రెమ్యూనరేషన్‌ను మేకర్స్ ముట్టజెప్పారట. ఈ సినిమాతో జెనీలియా సైతం దక్షిణాదిలో రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.