కిరణ్, ఆలేఖ్య రెడ్డి హీరో హీరోయిన్స్‌గా ఆక్సా ఖాన్, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘దీక్ష’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆర్ కె ఫిలిమ్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. జూలైలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి మనిషికి దీక్ష అనేది అవసరం. ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. ఇందులో హీరోయిన్ ను కాపాడే సీన్ లో భీముడి పాత్రలో ఆయన చెప్పిన లెంగ్తీ డైలాగ్ హైలైట్ అవుతుంది. అలాగే అక్సాఖాన్ తన నటనతో పాటు ఈ చిత్రంలో ఓ అదిరిపోయే పాట చేసింది’’ అన్నారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ .. ‘‘ఈ చిత్రంలో హీరోయిన్ అక్సాఖాన్ బాగా నటించింది. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, ఫైట్ మాస్టర్ రవితో పాటు మా డీవోపీ..ఇలా ప్రతి టెక్నీషియన్ కష్టపడి పనిచేశారు. నాకు నటనే జీవితం. ఎప్పుడూ సినిమా ఆలోచనే ఉంటుంది’’ అన్నారు. ‘‘ఎంతో టాలెంట్ ఉన్న కిరణ్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నేనొక స్పెషల్ సాంగ్ చేశాను. ఆ పాటలో సాంగ్స్ మీకు బాగా నచ్చుతాయి. తులసీ చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది’’ అని తెలిపింది.
ప్రజావాణి చీదిరాల