చిత్రం: మార్గాన్
విడుదల: 27-06-2025
దర్శకుడు: లియో జాన్ పాల్
సంగీతం: విజయ్ ఆంటోని
తారాగణం: విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, బ్రిగిడా, దీప్సిక, మహానటి శంకర్
ప్రొడక్షన్ హౌస్: విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని
ఎడిటర్: లియో జాన్ పాల్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.రాజా
స్క్రీన్ ప్లే: విష్ణు, లియో జాన్ పాల్
ఇటీవలి కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు కొదువ లేదు. కానీ వాటి సక్సెస్ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే.. సినిమాలో సస్పెన్స్ ఆకట్టుకోలేకపోవడం.. సినిమాలో ఏం జరుగుతోందనేది ముందుగానే తెలిసిపోవడం వంటి అంశాలతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ బాక్సాఫీస్ వద్ద చతికల పడుతున్నాయి. అయితే తమ సినిమా మాత్రం అలా చతికలపడదని బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందంటూ ‘మార్గాన్’ చిత్రబృందం గట్టిగానే చెప్పింది. మరి ఆ మాట చిత్ర బృందం నిలబెట్టుకుందా? ఈ సినిమా సక్సెస్‌కు చేరువైందా? అసలు సినిమా ఎలా ఉంది? చూద్దాం.
సస్పెన్స్ థ్రిల్లర్‌లకు స్క్రీన్‌ప్లే ప్రాణం.అది ఎంత గ్రిప్పింగ్‌గా ఉంటే సినిమా అంత మంచి సక్సెస్ సాధిస్తుంది. మార్గాన్ సినిమా విషయానికి వస్తే స్క్రీన్‌ప్లే అద్భుతమనే చెప్పాలి. ఒక ఇంజక్షన్ ద్వారా వరుసగా అమ్మాయిలను హత్య చేస్తుంటారు. ఇంజక్షన్ ఇవ్వగానే అమ్మాయి నల్లగా అయిపోయి మరణిస్తుంది. అసలు ఎవరు ఆ ఇంజక్షన్ ఇస్తున్నారు? ఎందుకు వరుస హత్యలు చేస్తున్నారనేది కథాంశం. సినిమాలో సస్పెన్స్‌ను అయితే ఏమాత్రం రివీల్ కాకుండా చక్కగా మెయిన్‌టైన్ చేశారు. ఎవరు హత్య చేస్తున్నారనే విషయం కూడా ఊహించలేం. మొత్తానికి సినిమా ఎండింగ్‌లో మాత్రం సస్పెన్ష్ రివీల్ అవుతుంది. ఎక్కడా సాగదీతలకు తావు లేకుండా చక్కగా నడిపించారు.
ఎవరెలా చేశారంటే..
పోలీస్ ఆఫీసర్ ధృవ్ కుమార్‌గా విజయ్ ఆంటోనీ అద్భుతంగా నటించారు. ఆయన మేనల్లుడు అజయ్ ధీషన్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు. అజయ్ అయితే తన పాత్రలో జీవించాడు. పోలీస్ ఆఫీసర్ శృతి పాత్రలో బ్రిగిడ అద్భుతంగా నటించింది. పెద్దగా మేకప్ లేకుండా సింపుల్‌గా బ్రిగిడ కనిపించింది. ఇక దీప్సిక అయితే ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా చాలా అందంగా కనిపించింది. ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా బాగానే కలిసొచ్చేలా ఉంది. ఇక మిగిలిన పాత్రదారులంతా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
టెక్నికల్ పరంగా..
సినిమాకు మ్యూజిక్ కూడా ప్రాణమనే చెప్పాలి. పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పాలి. విష్ణు, లియో జాన్ పాల్‌ల స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. లియో జాన్ పాల్ ఎడిటింగ్ కూడా సినిమాకు ప్లస్ అనే చెప్పాలి.
ఫైనల్ వర్డిక్ట్: సస్పెన్స్ థ్రిల్లర్‌లను ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా మంచి కిక్ ఇస్తుంది
రేటింగ్: 3/5
ప్రజావాణి చీదిరాల