మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షు ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా.. దయానంద్ గడ్డం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది, బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం నుంచి దం దిగా దం పాట విడుదలైంది. ఈ పాటకు ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించగా యాసిర్ నిసర్ తన స్వరాన్ని అందించారు.
ఈ సందర్భంగా వర్జిన్ చిత్ర నిర్మాత రాజా దారపనేని మాట్లాడుతూ… “సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటికే వర్జిన్ బాయ్స్ చిత్రం నుంచి టీజర్ ఇంకా ఒక పాటకు మంచి స్పందన లభించింది. సినిమా యూత్ ఫుల్‌గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని ఎన్నో ప్రశంసలతో కొనియాడారు” అన్నారు. చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ… “ఈ చిత్రం ఒక మంచి లవ్ స్టోరీ తో యూత్ ఫుల్ గా ఉండబోతుంది. సినిమా చూసినంతసేపు మీ కాలేజీ రోజు గుర్తొస్తాయి. ఈ చిత్రం కోసం నిర్మాత రాజా గారు అలాగే నటీనటులు అందరితో పని చేయడం నాకు ఎంత సంతోషకరంగా కనిపించింది. చిత్రంలో మంచి బిజీఎం తో పాటు మొత్తం ఆరు పాటలు ఉంటాయి’’ అన్నారు.
నటి జెన్నీఫర్ ఇమాన్యుల్ మాట్లాడుతూ… ‘‘ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బంధం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన వారితో పనిచేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’’ అన్నారు. నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ… ‘‘నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బాలు గారికి, మిత్ర గారికి, రాజా గారికి ధన్యవాదాలు. ఈ సినిమా పూర్తిగా యూత్ కు ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది. ఈ చిత్రంలో ఏది మంచిది ఏది కానిది అనేది ఎన్నో విషయాలు చెప్పాము’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల