విజయ్ రెమ్యూనరేషన్ విషయమై ‘జన నాయకన్’ సంచలనం

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అదేంటంటే విజయ్ రెమ్యూనరేషన్. విజయ్‌ ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ సౌత్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు గానూ విజయ్ రూ.275 కోట్లు రెమ్యునరేషన్ రూపంలో డైరెక్ట్‌గా అందుకున్నాడట. షేర్ కట్స్‌కు తావు లేకుండా ఫుల్ పేమెంట్‌ను విజయ్‌కు మేకర్స్ ఇచ్చేశారట. దక్షిణాదిన ఇప్పటి వరకూ ఏ హీరోకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందలేదట. విజయే ఫస్ట్ కావడం విశేషం.

సౌత్ ఇండియాలో స్టార్ హీరోలంతా ఎక్కువగా ప్రాఫిట్ షేరింగ్ లేదంటే పార్షియల్ రెమ్యూనరేషన్ వేలో సినిమాలు చేస్తున్నారు. కానీ ‘జన నాయకన్’ చిత్ర మేకర్స్ మాత్రం మార్కెట్‌పై ఉన్న నమ్మకంతోనో లేదంటే విజయ్‌పై ఉన్న నమ్మకంతోనో రెమ్యూనరేషన్ మొత్తాన్ని చెల్లించేసింది. ఇది విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో అంచనాలు ముందు నుంచీ భారీగానే ఉన్నాయి. కేవలం ఈ సినిమా కోసం మాత్రమే కాకుండా భవిష్యత్‌పై దృష్టి సారించి కేవీఎన్ నిర్మాణ సంస్థ ఇలా చేసిందని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 9, 2026 విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *