Hero Sriram: అతనే నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు

హీరో శ్రీరాం డ్రగ్స్ కేసులో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. తాను తప్పు చేసినట్టు అంగీకరించాడు. అంతేకాకుండా అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాదే తనకు డ్రగ్స్ అలవాటు చేశాడని న్యాయస్థానికి వివరించాడు. శ్రీరాంకు ప్రసాద్ రూ.10 లక్షలు ఇవ్వాలట. ఆ డబ్బు అడిగిన ప్రతిసారి తనకు కొకైన్ ఇచ్చేవాడని శ్రీరాం చెప్పుకొచ్చాడు. అలా తనకు డ్రగ్స్ అలవాటు అయ్యాయని తెలిపాడు. తాను డ్రగ్స్ తీసుకున్నానే తప్ప అమ్మలేదని స్పష్టం చేశాడు.

డ్రగ్స్ తీసుకోవడం తప్పని తనకు కూడా తెలుసన్నాడు. తన బిడ్డ అనారోగ్యంతో ఉన్న కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. శ్రీరాం అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఆయనకు జూలై 7 వరకూ రిమాండ్ విధించింది. ఇదే కేసుతో సంబంధమున్న మరో నటుడు కృష్ట కోసం పోలీసులు గాలిస్తున్నారు. హీరో శ్రీరాం.. ‘ఒకరికి ఒకరు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అనంతరం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దాదా, స్టాప్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *