టాలీవుడ్లోకి ఒక్కసారిగా కెరటంలా దూసుకొచ్చింది శ్రీలీల. తొలి సినిమా హిట్ కాకున్నా.. ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవలి కాలంలో శ్రీలీలకు పెద్దగా హిట్స్ పడట్లేదు. చివరకు ‘పుష్ప 2’లో చేసిన స్పెషల్ సాంగ్ కూడా అమ్మడికి అంతలా కలిసి రాలేదు. ఆ తరువాత చేసిన ‘రాబిన్ హుడ్’ చిత్రం కూడా అమ్మడికి అంతలా కలిసి రాలేదు. అలాంటిది ఈ ముద్దుగుమ్మ అఖిల్ సినిమాకు హ్యాండ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది. అలాగే తెలుగులో అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’ మూవీకి కూడా సైన్ చేసింది.
మొత్తానికి అఖిల్ సరసన శ్రీలీల నటిస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా మేకర్స్ ఈ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. దీపావళికి మూవీ రిలీజ్ అని చెప్పారు. అయితే హిందీ, తమిళ సినిమాలకు డేట్స్ అన్నీ ఇచ్చేసిన కారణంగా ‘లెనిన్’కు డేట్స్ కేటాయించలేకపోతోందట. దీంతో మరో హీరోయిన్ని చూసుకోవాలని ‘లెనిన్’ టీం భావిస్తోందట. ప్రస్తుతం శ్రీలీల రవితేజ సరసన ‘మాస్ జాతర’ చిత్రంలో నటిస్తోంది. అలాగే పవన్ కల్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లోనూ నటిస్తోంది. హిందీలో ‘ఆషికి 3, తమిళంలో ‘పరాశక్తి’ వంటి చిత్రాలు చేస్తోంది.