Rajamouli: రాజమౌళి ఇంత పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తారని ఎవ్వరూ ఊహించలే..

ఓ వీడియో గేమ్‌లో మనకు ఇష్టమైన నటుడో.. లేదంటే దర్శకుడో కనిపిస్తే ఎలా ఉంటుంది? చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది కదా.. దర్శకధీరుడు రాజమౌళి ఓ వీడియో గేమ్‌లో మెరవనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన విజువల్స్, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హిడియో కోజిమా గురించి వీడియో గేమ్‌లు ఆడే వారందరికీ తెలిసిందే. ఆయన డెత్ స్ట్రాండింగ్ అనే గేమ్‌ను రూపొందించారు. ఇది సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన సెకండ్ వెర్షన్ రానుంది. దీనిలోనే రాజమౌళి, కార్తికేయ కనిపించనున్నారు. ‘డెత్ స్ట్రాండింగ్ 2’గా ఈ గేమ్ రూపొందుతోంది.

దీనిలో ప్రముఖ హాలీవుడ్ నటులు నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్‌లతో పాటు రాజమౌళి, కార్తికేయ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వీడియో గేమ్ జూన్ 26 నుంచి ప్లే స్టేషన్‌లో పూర్తిగా అందుబాటులో ఉంటుంది. దీనిలో వినోదాత్మక కేమియో రోల్‌లో రాజమౌళి కనిపించనున్నట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ద్వారా తెలుస్తోంది. జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్న సమయంలోనే రాజమౌళికి హిడియో కోజిమా పరిచయం అయినట్టు సమాచారం. అప్పట్లో దీనికి సంబంధించి ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కలిసి ఉంటారని అంతా లైట్ తీసుకున్నారు. ఇంత పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తారని ఊహించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *