Ananthika: ఈ పాత్ర నా పర్సనల్ లైఫ్‌కు కూడా కనెక్ట్ అయ్యింది

పాన్ ఇండియా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ లేటెస్ట్ హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని , వై.రవిశంకర్ నిర్మించారు. జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదలైన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని హార్ట్ వార్మింగ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లో సినిమా చూస్తున్నప్పుడు చాలా గ్రేట్ ఫుల్‌గా అనిపించింది. ఇలాంటి మంచి టీంతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు ఫణి గారికి, మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్ యూ. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా రిహార్సల్ చేశాం. ఈ పాత్ర నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింద’’ అన్నారు

నటుడు హను రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి మంచి టీంతో కలిసి పని చేయడం ఒక బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను. సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది ఎప్పటికీ గర్వపడే సినిమా. ఇలాంటి సినిమాతో డెబ్యు చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. యాక్టర్ రవి మాట్లాడుతూ… ‘‘ప్రీమియర్స్ నుంచి ఇప్పటిదాకా 6 షోస్ చూశాను. ఆడియన్స్ నుంచి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. మా డైరెక్టర్ ఈ సినిమాకి ప్రేక్షకుడిలా వెళ్లి ప్రేమికుల బయటకి వస్తారని చెప్పారు. అది ఈ రోజు జరిగింది. చాలా స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసామని అడియన్స్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది’’ అన్నారు

డిఓపి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. ‘‘గత రెండు రోజులుగా చాలా థియేటర్స్ తిరిగాను. అన్ని హౌస్ ఫుల్ ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాలు అయింది ఎలాంటి సినిమా చూసి అని ఆడియన్స్ చెప్పారు. అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఈ సినిమాకి వచ్చిన ప్రతి కాంప్లిమెంట్ చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. యాక్టర్ కన్నా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను చేసిన కార్తీక్ క్యారెక్టర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్యారెక్టర్‌లో నన్ను బిలీవ్ చేసిన డైరెక్టర్ ఫణి గారికి థాంక్యూ’’ అన్నారు. నటి సంజన మాట్లాడుతూ… ‘‘సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ ఫణి గారికి థాంక్యూ. అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’’ అన్నారు. యాక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఫస్ట్ షాట్ నా మీదే తీశారు. డైరెక్టర్ గారు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అనంతిక, హను, రవి వీళ్ళ అందరితో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది’’ అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *